Sunday, January 19, 2025

కాంగ్రెస్‌లోకి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : కొడంగల్ బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని గుర్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. గతంలోనూ కొడంగల్ లో గుర్నాథ్ రెడ్డిని రేవంత్ కలిశారు. గత కొంత కాలంగా గుర్నాథ్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రేవంత్ గుర్నాథ్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News