Friday, November 22, 2024

ఆ విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రైతు రుణమాఫీ, రైతు బంధు విషయంలో ఎంఎల్ సి జీవన్‌రెడ్డి సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డి సమావేశమైన సందర్భంగా సిఎం మాట్లాడారు. జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని, మంత్రి శ్రీధర్‌బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని, జగిత్యాల అభివృద్ధి కోసం సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, జగిత్యాల నియోజకవర్గంతో పాటు రైతుల కోసం జీవన్ రెడ్డి కొట్లాడారని ప్రశంసించారు. ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని, ప్రస్తుతం విద్యాశాఖను తానే ఫుల్ టైమ్‌గా చూస్తున్నామని, తన ఆధ్వర్యంలో విద్యాశాఖ సక్సెస్‌గా పరీక్షలు నిర్వహించిందని, విద్యాశాఖ మీద ఎన్నో సమీక్షలు నిర్వహించామన్నారు. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతంగా పాలన సాగుతుందని కొనియాడారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర వినతులు ఇచ్చామని, ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా కేంద్ర పెద్దలను కలుస్తున్నామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తున్నామని, శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా పాలన సాగిస్తున్నామని, చిన్న చిన్న గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించామన్నారు. బిఆర్‌ఎస్‌ను కాపాడేందుకు కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. కెసిఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని, అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన నెలరోజులకే ప్రభుత్వాన్ని పడగొడుతామని కెసిఆర్ అన్నారని, బిఆర్‌ఎస్, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని పడగొడుతామని అంటున్నాయని, పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ ఓట్లు బిజెపికి వేసి కాంగ్రెస్ ను ఓడించాలని చూశారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News