Wednesday, January 22, 2025

మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటిక్రితం ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

మరికాసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆయన కలువనున్నారు. డిసెంబర్ 7న(గురువారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలందరినీ రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News