Tuesday, December 24, 2024

కోమటి రెడ్డితో రేవంత్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి కోమటి రెడ్డి నివాసంలో బుధవారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు చర్చ సాగింది. ఈ చర్చలో భాగంగా వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ వ్యూహల గురించి చర్చించారు. పార్టీలో చేరికలపై రెవంత్ రెడ్డి కోమటి రెడ్డితో చర్చించారు. చేరికలపై ఎలాంటి విభేదాలు లేవని,చాలా మంది పార్టీలో చేరుతామని వస్తున్నారని, స్థానిక నేతలను అడగక కుండా నిర్ణయం తీసుకోమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కోమటి రెడ్డి తో కలిసే పని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: ఎంఎల్ఎ రాజయ్య పై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు కలిసి పని చేస్తామన్నారు.లోక్ సభ ఎన్నికల్లో కనీసం 15 సీట్లు గెలిపించేందుకు అందరము కలిసి పనిచేస్తామని, కోమటి రెడ్డి , ఉత్తమ్ కుమార్, జానారెడ్డిని సంప్రదించకుండా పార్టీలో చేరికలు ఏవీ జరగడం లేదని,ఆ ముగ్గురు తో చర్చించాకే పార్టీలో చేర్చుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎంపి కోమటి రెడ్డి  అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News