Wednesday, January 22, 2025

పొంగులేటి, రేవంత్‌తో రాహుల్‌ జూమ్ మీటింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని పార్టీలో టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిక తేదీపై ముగ్గురి మధ్య చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లా నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. నాయకులకు రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీకాంగ్రెస్ నేతలు మాజీ నేతలతో వరసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News