Monday, November 18, 2024

ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ

- Advertisement -
- Advertisement -

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో
మర్యాద పూర్వకంగా భేటీ
పలు అంశాలపై చర్చ
సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు
రాత్రి ఎంపిల విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. ఉదయం సిఎం రేవంత్‌రెడ్డి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓటింగ్ శాతం, ఓడిపోయిన చోట్ల ఎలాంటి సమీకరణాలు పనిచేశాయి, ఎందుకు ఓడిపోయామన్న విషయాల గురించి సోనియాకు సిఎం రేవంత్ వివరించినట్టుగా సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి సోనియాతో ముఖ్యమంత్రి చర్చించినట్టుగా తెలిసింది.

మధ్యాహ్నం సీడబ్లూసీ సమావేశంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలను సిఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వివరాలను రాహుల్‌తో ముఖ్యమంత్రి చర్చించినట్టుగా తెలిసింది. సాయంత్రం తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌కు చెందిన 8 ఎంపిలతో సోనియాను కలిశారు. ఆ ఎనిమిది ఎంపిలను సిఎం రేవంత్ సోనియాకు పరిచయం చేయడంతో పాటు ఆమెతో ఆ ఎంపిలు ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి ఏఐసిసి అధ్యక్షుడు ఇచ్చిన డిన్నర్‌కు సిఎం రేవంత్ తెలంగాణ ఎంపిలతో కలిసి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News