- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని తన పార్లమెంట్ కార్యాలయంలో విద్యార్థి, యువజన నాయకులతో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు జరప తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, నేతలు బెల్లయ్య నాయక్, హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -