Monday, December 23, 2024

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన క్రమంలో సిఎం వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా సిఎం కోవింద్‌కు వీణను సిఎం బహుకరించారు. అనంతరం కాసేపు వివిధ అంశాలపై వారు చర్చించారు. కాగా, జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను సిఎం రేవంత్ రెడ్డి కలిసినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News