Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లోకి తుమ్మల!

- Advertisement -
- Advertisement -

ఇంటికెళ్ళి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలు భేటి అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్ళిన కాంగ్రెస్ నేతలు తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తుమ్మలకు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కక పోవడంతో ఆయన గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన అనుచరులతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే పాలేరు టికెట్ ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News