Sunday, January 19, 2025

లిక్కర్ స్కామ్‌పై రేవంత్ ఎందుకు స్పందించడంలేదు: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దీక్షలు చేసే అర్హత ఎంఎల్‌సి కవితకు లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇవాళ బండి మీడియాతో మాట్లాడారు. మహిళలపై సైబర్ నేరాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. మహిళా సర్పంచ్‌లకు ఎంఎల్‌ఎల నుంచి రక్షణ లేదని, మహిళలపై దాడులు జరుగుతున్నా సిఎం ఎందుకు స్పందించరని అడిగారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో ఎంతమంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌పై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని బండి నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహిళా బిల్లుకు బిజెపి కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News