Saturday, December 21, 2024

రేవంత్ పాదయాత్ర..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ‘యాత్ర’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. “హాత్ సే హాత్ జోడ్ అభియాన్‌” పేరుతో ఆయన యాత్ర నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్రు చేపట్టాలని ఎఐసిసి ఇప్పటికే ఆదేశించింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు వ్యవహరిస్తున్నారు. సునీల్ సూచనలు, సలహల మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహలు రచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కమిటీలు చిచ్చు రేపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News