Saturday, December 21, 2024

రాజగోపాల్‌రెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ బంపర్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

Revanth Reddy Padayatra in Munugodu

తిరిగొస్తే టికెట్ ఇస్తాం..
అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం
రాజగోపాల్‌రెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ బంపర్ ఆఫర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన మునుగోడు తాజా మాజీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకే మునుగోడు టికెట్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ తరపున రాజగోపాల్‌రెడ్డికి బీ ఫామ్ ఇవ్వడంతో పాటుగా సీనియర్ నేతలంతా కలిసి ఆయనను మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించుకుంటామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండగ అని వ్యాఖ్యానించిన రేవంత్.. బిజెపిలో ఎల్‌కె అద్వానీ, వెంకయ్యనాయుడుల పరిస్థితి అందుకు నిదర్శనమని తెలిపారు. పార్టీ మారి బిజెపిలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యమే దక్కలేదని ఆయన అన్నారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో వెంకట్‌రెడ్డి తప్పనిసరిగా పాలుపంచుకుంటారని చెప్పారు.

Revanth Reddy Padayatra in Munugodu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News