Thursday, January 23, 2025

వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం కాంగ్రెస్ ధర్నా.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహాన్ రెడ్డి అధ్యక్షతన, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల చావును కోరుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల చావులు ఉండవని అన్నారు. ఫాంహౌస్‌లో పడుకున్న కెసిఆర్‌ను నిద్ర లేపడాపికి మూడింతల నిరసన కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.

ఇప్పటికి మండల స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో ధరణి కోసం ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నామని అన్నారు. పోడు భూముల విషయంతో పాటు ధకణి సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ అధ్వర్యంలో సోమేష్ కుమార్‌కు వినతి పత్రం ఇచ్చామని, అయిన ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో నిరుపేదలైన 84 లక్షల మంది రైతులకు భూములు పంపిణి చేసిందని, ఇప్పుడు ధరణి పేరుతో ఆ భూములను ప్రభుత్వం లాక్కుని అమ్ముకుంటుందని అన్నారు.2018 ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు ఏక కాలంలో లక్ష రుణ మాఫి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చలేదని అన్నారు.

దేశంలో లిక్కర్ స్కాం రాష్ట్రంలో ఎమ్యెల్యేల కొనుగోలు తప్పా ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందన లేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న సిఐడి, ఈడి ధాడులు గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు జరగడం లేదని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డాడు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News