Monday, December 23, 2024

నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అట్టహాసంగా భూమి పూజ జరగనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారని చెప్పారు.

ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ లో చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుందని, ఈ సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభం ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News