Sunday, December 22, 2024

చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సిఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి 135, జనసేన 21, వైఎస్ఆర్ సిపి 11, బిజెపి 8 సీట్లలో గెలిచిన విషయం తెలిసిందే. 175 సీట్లకు ఎన్ డిఎ కూటమి 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News