Saturday, December 28, 2024

కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఓ మహా సముద్రం అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదని పేదల బందువులు అని టిపిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శని వారం జనజాతర సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో జనజాతర సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తె కెరటాలు, పోరాడే సైనికులు అని ప్రశంసించారు. మా కార్యకర్తలు త్యాగశీలులు తెగించి కొట్లాడే వీరులు అని కొనియాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసే బోయీలు మాత్రమే కాదని, ఎజెండాలు నిర్ణయించే నాయకులు అని స్పష్టం చేశారు. శనివారం తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది అని, చేసిన శబ్ధమిది అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News