- Advertisement -
హైదరాబాద్: ఏడాది క్రితం ఇదే రోజు మార్పు కోసం రైతు ఓటు వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాది క్రితం వేసిన ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని ప్రశంసించారు. మహబూబ్ నగర్ లో రైతన్న పండుగకు వెళ్తున్న సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద ఏడాదికి రూ.7625, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని, ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తీసుకొచ్చామని, అన్నదాతలతో కలిసి రైతు పండుగ కోసం పాలమూరుకు వస్తున్నామన్నారు.
- Advertisement -