Sunday, December 22, 2024

గీతారెడ్డికి అవార్డు రావడం సంతోషం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 1990లో భారత్ సద్భావనా యాత్రను దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్డును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రదానం చేశారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. గీతారెడ్డికి అవార్డు రావడం సంతోషంగా ఉందని, గీతారెడ్డికి అవార్డు ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని గీతారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. పేదల అభివృద్ధి కోసం గీతారెడ్డి పని చేశారని ప్రశంసించారు. మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ అని రాజీవ్ నమ్మరన్నారు.

గాంధీ కుటుంబం నిర్ణయంతోనే పేదలకు న్యాయం జరిగిందని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎఐసిసి అగ్రనేత సోనియా గాంధీ ప్రధాని పదవి త్యాగం చేశారన్నారు. దేశం కోసం ఆస్తులు, సంపదను గాంధీ కుటుంబం త్యాగం చేసిందని, పదవులను త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి దక్కుతుందని, పదవులను గొప్ప వ్యక్తులకు ఇచ్చిన ఘనత సోనియాగాంధీ, రాహుల్ గాంధీకే దక్కుతుందన్నారు.  నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వారే హైడ్రాను చూసి భయపడుతున్నారని, హైడ్రాను చూపి రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని, గండిపేటలో పేదలు ఇళ్ల కట్టుకోలేదన్నారు. పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని, కొంత మంది నేతలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతియ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్‌గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు లేదన్నారు. అజీజ్‌నగర్‌లో హరీష్‌రావుకు ఫాంహౌస్ లేదా? అని అడిగారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ది దోపిడి చరిత్ర అని, చెప్పులు లేకుండా తిరిగిన వారు ఇప్పుడు విమానాల్లో ఎలా తిరుగుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News