Saturday, April 19, 2025

నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడిని తిరగ రాశారు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడిని తిరగ రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని, రుజువు చేసి చూపించారని ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని వారిని మెచ్చుకున్నారు.

ఎపికి చెందిన హేమంత్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి వెళ్లేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఉగాది రోజు షిర్డీకి వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాని వైద్యులు తెలిపారు. హేమంత్ కడుపు ఉబ్బిపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఒప్పుకోలేదు.

వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సెలవు రోజులు కావడంతో వైద్యులు అడ్మిన్ చేసుకొని సకాలంలో పరీక్షలు చేశారు. కడుపులో పేగుకు రంద్రం పడిందని గుర్తించారు. వెంటనే వైద్యులు అజ్మీరా, విక్రమ్ సారథ్యంలో సర్జరీ చేసి కడుపులోని వ్యర్థాలను బయటకు తొలగించారు. పేగు రంద్రాన్ని మూసి వేసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. లక్షలతో కూడిన వైద్యం ఉచితంగా చేయడంతో అతడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు సేవలు అద్భుతంగా ఉన్నాయని తల్లిదండ్రులు ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News