Friday, December 20, 2024

ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం ఇచ్చేందుకు కెసిఆర్ సిద్ధమయ్యారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ జోరు ఆపడం ఎవరి తరం కాదని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. బిఆర్ఎస్ పని అయిపోయింది.. ఆ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థతి లేదని ఆయన చెప్పారు. ఓటమి భయంతో రైతులకు పింఛన్, ప్రజలకు ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారని తెలిపారు.

బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖామని, ఆ పార్టీకి 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. సర్వేల్లో ఓసిల కంటే బిసిలకు 2 శాతం తక్కువ ఉన్నా బిసిలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. బిసిలకు బిఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఇస్తామని మరోసారి రేవంత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News