Wednesday, January 22, 2025

రెండో జాబితాలో షబ్బీర్ అలీ, కొండా సురేఖల పేర్లు ఉంటాయి: రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

టికెట్ దక్కని నేతలకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సూచన
నన్ను తిట్టండి…కానీ, పార్టీని తిడితే ఊరుకోను
రెండో విడత జాబితాలో షబ్బీర్ అలీ, కొండా సురేఖల పేర్లు ఉంటాయి
ఎవరూ అధైర్యపడొద్దు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: టికెట్ దక్కని నేతలకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. టికెట్ ఆశించి రాకపోతే ఎవరికైనా బాధ ఉంటుందని, కానీ, పార్టీ నిర్ణయాలను అర్ధం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. టికెట్ దక్కని నేతలు కోపంలో తనను తిడితే పట్టించుకోనని, కానీ, పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ఎవరైనా సరే పార్టీకి, శ్రేణులకు నష్టం చేస్తే సహించనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా మంచైనా, చెడైనా తానే భరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏఐసిసి నిర్ణయాలకు అనుగుణంగా పని చేస్తాని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో పొన్నాల ఓడినా పార్టీ టికెట్ ఇచ్చిందని ఈ సారి కూడా పొన్నాల పేరు అధిష్టానం పరిధిలో ఉందని ఆయన తెలిపారు.

ఇక, సీక్వెల్‌గా ఈక్వెల్‌గా ఫస్ట్ లిస్ట్‌లో కొంత మంది యోధులను ఆపామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో షబ్బీర్ అలీ, కొండా సురేఖ లాంటి వాళ్ల పేర్లు ఉంటాయని ఆయన తెలిపారు. 55 మందితో కూడిన మొదటి జాబితాను ఏఐసిసి ఆదివారం విడుదల చేయగా టికెట్ దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉప్పల్ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి అనుచరుడు హరివర్ధన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడంతో రేవంత్ పై విధంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News