Wednesday, January 22, 2025

కెసిఆర్ పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలకు విముక్తి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టిపీడిస్తోంది. రానున్న రోజుల్లో ప్రజలకు విముక్తి లభిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఉద్యమ కారులకు సముచిత స్థానం కల్పిస్తాం. మేము ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించింది.

ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి. సిఎం కెసిఆర్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించన తర్వాత సిఎం కెసిఆర్ ప్రజాక్షేత్రంలో లేరు. కెసిఆర్ ఎక్కడ ఉన్నారని తెలంగాణ ప్రజలు వెతకాల్సిన పని లేదు. కెసిఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక ముందు కెసిఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమి లేదు.సచివాలయ నిర్మాణంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడికి పాల్పడింది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News