Wednesday, January 22, 2025

కెఏ పాల్ పార్టీతోనూ బిజెపి పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీ జనసేనతో టు కెఏ పాల్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని టిపిసిసి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో టి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిశామని, నోటిఫికేషన్ లోపల నగదు బదిలీలు పూర్తి చేయాలని కోరడంతో పాటు డిజిపి  అంజనీకుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రలను బదిలీ చేయాలని కోరామన్నారు.

అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడి, సిబిఐలు ముందు వెళ్తాయన్నారు. కాంగ్రెస్‌ను వీడిన నాయకులు బిజెపి సిద్ధాంతాలు నమ్మి పోలేదన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి, డికె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డిలు సిద్ధాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే తాను, భట్టి ఎక్కడినుంచైనా పోటీ చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News