Monday, January 20, 2025

తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy press meet on Rajagopal Reddy Resign

హైదరాబాద్: తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమాజం నిశీతంగా పరిశీలిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో బిజెపి అరాచకాలు  చూపెడుతోంది. పార్లమెంట్ శాసన విధానాలనే కించ పరుస్తూ వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం బహిష్కరించాలి. తెలంగాణ కోసం కొట్లాడినం అని చెప్పుకునే ముసుగు వీరులు.. తమ ఆర్ధిక అవసరాల కోసం మోడీ, అమిత్ షాలు వేసిన ఎంగిలి మెతుకుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారు. తెలంగాణ తల్లి సోనియాగాంధీ ఇచ్చిన మాటకు నిలబడి, ఆంధ్రలో పార్టీ ఓడినా.. రాష్ట్రం ఇచ్చింది. రాజకీయ కక్ష్యలతో సోనియాను అవమానిస్తున్న పరిస్థితుల్లో, అమిత్ షాతో కాంట్రాక్టులు చేసుకున్నారు. పోరాటం చేయాల్సింది పోయి కుక్క బిస్కట్ల కోసం మోడీ, అమిత్ షా పంచన చేరారు. కాంగ్రెస్ తో ఉన్న పేగు బంధం తెగిపోయింది. మునుగొడులో కాంగ్రెస్ ను గెలిపించారు.. ఆర్ధిక బంధాల కోసమే తల్లి లాంటి కాంగ్రెస్ ను అవమానించారు. గతంలో లాగా వ్యవహారాలు ఉండవు. పార్టీకి నష్టం కలిగిస్తే ఉరుకోం. మునుగోడు ఉప ఎన్నికల కోసం కమిటీ వేయనుంది ఏఐసీసీ. 5న మునుగొడులో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల, ఆర్ధిక లావాదేవీలకు పులి స్టాప్ పెడతాం. మునుగొడు ప్రజలు కొత్త చరిత్ర సృష్టిస్తారు. దుష్ట శక్తులకు గుణపాఠం చెపుతారు. మునుగోడు కాంగ్రెస్ క్యాడర్ కు మేమున్నాం.. మీ బాధ్యత మాది. కాంగ్రెస్, కోమటిరెడ్డి కుటుంబానికి అన్ని హోదాలు ఇచ్చింది. కాంగ్రెస్ వల్ల వాళ్లకు బ్రాండ్ పెరిగింది. ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారు. నాణానికి మోడీ, కేసీఆర్ లు బొమ్మ బొరుసు.వెంకట్ రెడ్డి పై మాకు నమ్మకం ఉంది. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారు.5వ తేదీన మునుగుడులో మధ్యాహ్నo 2 గంటలకు సమావేశం నిర్వహిస్తాం. ఉపఎన్నికల కు రెడీ అవుతున్నాం. మునుగోడు ఉపఎన్నికలకు పిలుపు ఇస్తున్నాం. రాజ్ గోపాల్ రెడ్డి వెళ్లిన సందర్భం దుర్మార్గంగా ఉంది. ఇంతకాలం ఆయన వల్ల పార్టీకి నష్టం వచ్చినా ఓపికతో ఉన్నాం. లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చిన అని ఈటల సిద్ధాంతం వదిలారు. ఇపుడు సిగ్గు కూడా తప్పారు. ఫిరాయింపుల కమిటీకి ఛైర్మెన్ గా ఉండడం దుర్మార్గం” అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy press meet on Rajagopal Reddy Resign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News