Friday, December 20, 2024

నన్ను వేధించేందుకే సిట్ నోటీసులు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనను వేధించేందుకే సిట్ నోటీసులు ఇస్తుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సిట్ నోటీసులు ఇస్తుందని ఊహించానని చెప్పారు. సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. టిఎస్‌పిఎస్‌సి పరీక్షా ప్రశ్నాపత్రాలు సంతలో సరుకులా మారాయని ఆయన ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

’కంప్యూటర్ల భద్రతపై ఐటీశాఖ ఆడిట్ జరగాలి. ఆడిట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం ధ్రువీకరించిన ఏజెన్సీనే ఆడిట్ కోసం ఏర్పాటు చేయాలి. కంప్యూటర్ల సమాచారం బయటకు రావడానికి బాధ్యత ఐటీ మంత్రిదే. నాకు సిట్ నోటీసులు ఇవ్వడం నేను ఊహించిందే. ఇప్పటికైతే సిట్ నోటీసులు నాకు చేరలేదు. ఒకవేళ వస్తే సిట్ నోటీసులు స్వాగతిస్తాను. రాజ్యాంగం, సంస్థల పట్ల గౌరవం ఉన్న పార్టీ కాంగ్రెస్. ప్రభుత్వం మమ్మల్ని వేధించాలనే ఉద్దేశంతో మాకు నోటీసులు ఇస్తోంది.’-రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News