Thursday, December 26, 2024

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. బుధవారం మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్, తన అనుచరులతో కలిసి గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్‌చార్జీ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రశేఖర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషింరని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

చేవెళ్ల సభ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News