Sunday, December 22, 2024

డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: డిసెంబర్ తొమ్మిది కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యాం స్ధాపిస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని డిసెంబర్ తొమ్మిదన ఎల్‌బి స్టేడియంంలో నిర్వహింంచే సిఎం ప్రమాణణ స్వీకారం ఆరు గ్యారంటీలపై ఉంటుందని ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీలతో పాటు చేవెళ్ల అసెంబ్లీ సీటును కూడా కైవసం చేసుకుంంటామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నినర్వహించిన ప్రజాభేరి ఎన్నికల శంఖారావాన్ని పూరించి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నుంచి జిల్లా గ్రంంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సనగారి కొండల్‌రెడ్డి, ధారూర్ పిఎసిఎస్ మాజీ ఛైర్మన్ ప్రస్తుత ఎంపిపి భర్త హన్మంత్‌రెడ్డితో పాటు భారీగా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వికారాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు గత సెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థి గెలుపును భుజాలపై వేసుకుని ప్రచారం చేశారని, అలాంటి వారిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రాధాన్యత ఇవ్వకుండా దూరం పెట్టారని,బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం మహిళలను గౌరవిస్తామని రాజకీయాలు సిద్ధాంతపరంగానే పోరాటాలుంటాయని సోదరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా మూడు సార్లు పని చేసినసునితా మహేందర్ రెడ్డిని ప్రస్తుత జడ్‌పీ ఛైర్‌పర్సన్ వాహనాన్ని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుని రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వికారాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ విజయభేరి సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. గత ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన డాక్టర్ చంద్రశేఖర్‌ను ఒప్పించి జహిరాబాద్‌లో టికెట్ ఇవ్వడం జరిగిందని,

వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్ గెలుపుకు పని చేయాలని సూచించినట్టు తెలిపారు. సిఎం కెసిఆర్ సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్‌లో ఎన్నికల మెనిఫెస్టోను ప్రకటించారని అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీని కాపి కొట్టిందేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ గడ్డ నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నామని, రాష్ట్రంలో వికారాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News