Friday, December 20, 2024

ముగిసిన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల పాటు విదేశీ పర్యటన కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పర్యటనలో సిఎంఒ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐ.టి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా వివిధ కంపేనీల సిఈఒలతో చర్చించి ఒప్పంచి దాదాపు 40వేల కొట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు. ఇక ఈ నెల 18వ తేదీన లండన్ కు సిఎం రేవంత్ రెడ్డి, ఐఎఎస్ అధికారులు దానకిషోర్, ఆమ్రపాలి తదితరులు వెళ్లారు. ఆదివారం నాడు దుబాయ్ కి వెళ్లారు.. రెండు లండన్, దుబాయిలలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటి అయిన సిఎం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇవాళ హైదరాబాదుకు చేరుకున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News