Sunday, November 17, 2024

24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో ఓట్లు అడగం: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యమని ఆ విషయం కాంగ్రెస్‌కు తెలుసని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పటి టిడిపి ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్ కేసులు పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వేలాది మంది అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారన్నారు. అందులో భాగంగానే బషీర్‌బాగ్ వద్ద రైతులపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సాగుకు 24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో తాము ఓట్లు అడగమని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని తేలిందో అక్కడ బిఆర్‌ఎస్ ఓట్లు అడగొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెఫరెండానికి తాము సిద్ధమని గ్రామ సభల్లో రైతులను అడుగుదామని ఆయన వివరించారు. సచివాలయంలోకి ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లలేని దుస్థితి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయించిన వాళ్లే ఇవాళ కెసిఆర్ చుట్టూ ఉన్నారని రేవంత్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News