Monday, December 23, 2024

2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని టిపిసిసి అధ్యక్షుడుల రేవంత్ రెడ్డి అన్నారు. 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్ వంచ్చిందన్నారు. జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందని, హిమాచల్ ప్రదేశ్ తొలివిజయం, కర్ణాటకలో రెండో విజయమని తెలంగాణలోనూ విజయం సాధించబోతున్నామని చెప్పారు. కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసమే కాని రాజకీయ అంశం కాదని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధి నఫ్రత్ ఛోడో అంటూ ఇచ్చిన సందేశాన్ని విశ్వసించి కర్నాటక ప్రజలు మోడిని ఓడించారన్నారు. రాముడిని మోసం చేసిన బిజెపిని భజరంగభలీ ఓడించారని రేవంత్ అన్నారు.

రాముడిని అడ్డంపెట్టుకొని పార్టీ విస్తరించుకోవాలనుకోవడం బిజెపి మానుకోవాలన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి సర్వశక్తులు ఒడ్డిందని, కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్నిచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ భారత ంలో బిజెపికి స్థానం లేదని అన్నారు. అహంకారం, అవినీతి సొమ్ముతో భటపెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను ఓడించాలని మోడి, బిజెపి చేసిన కుట్రలను కన్నడ ప్రజలు తిప్పికొట్లారని రేవంత్ రెడ్గి చెప్పారు. తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని, ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బిఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని రేంవత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎఐసిసి ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శులు , ఇతర నేతలతో కలిసి నాంపల్లి దర్గాను కూడా రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశాంలో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News