- Advertisement -
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళకు రావలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని మరీ ఆహ్వానించారు.
మహా కుంభమేళ అలహాబాద్(ప్రయాగ్) లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ముక్తి, మోక్షం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు మాఘ మాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమే జరుపుకుంటారు. ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళ అన్ని కుంభమేళల్లో అత్యంత ముఖ్యమైనదిగా ప్రాచుర్యం పొందింది.
- Advertisement -