Wednesday, January 22, 2025

డిఎస్‌సి ఫలితాలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేవలం 55 రోజుల్లోనే డిఎస్‌సి ఫలితాలు ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్‌సి ఫలితాలను విడుదల చేశారు. డిఎస్‌సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అక్టోబర్ 9న ఎల్‌బి స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తామని, పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే డిఎస్‌సి ఇచ్చిందని, గత ప్రభుత్వం ఏడు వేల పోస్టులతో ఒకే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేశామని, త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామన్నారు. పాఠశాలల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 1న 11062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్‌సి పరీక్షల నిర్వహించారు. 2.16 లక్షల మంది అభ్యర్థులు డిఎస్‌సి పరీక్షలు రాశారు.

డిఎస్‌సి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News