Thursday, January 23, 2025

పాలనపై రేవంత్ మార్క్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

గత ప్రభుత్వంలో సిఎంఒలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌కు స్థాన
చలనం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియామకం..
గతంలో ఆమె నిర్వహించిన సాగునీటి కార్యదర్శి పదవి
రాహుల్ బొజ్జాకు అప్పగింత.. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి పరిపాలనా రంగంలో తన మార్కు ఉండేటట్లుగా బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. అం దులో భాగంగానే గత ప్రభుత్వ పాలనకు, తన హ యాంలో పాలనకు తేడా చూపించాలని, ప్రజా ప్ర భుత్వ పాలన అంటే ఎలా ఉంటుందో కూడా ప్రజలకు, అధికార యంత్రాంగానికి తెలియజే విధం గా కీలకమైన పదవుల్లో తనకు, తన మంత్రివర్గ సహచరులకు తెలిసిన ఐఎఎస్ అధికారులను గు ర్తించి, బ్యూరోక్రాట్లపై సమగ్రంగా ఆధ్యయం చేసి పోస్టింగ్‌లు ఇస్తున్నారని, ఈ విషయంలో ఎలాం టి తొందరపాటుకు తావులేకుండా బదిలీ ప్రక్రియ ను చేపట్టారని కొందరు సీనియర్ అధికారులు సై తం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో తనదైనశైలిలో మార్పును చూపించే కార్యక్రమంలో భా గంగానే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకమైన స్థానాల్లో తోటి బ్యూరోక్రాట్లతోనే అనేక విమర్శలను ఎదుర్కొన్న అధికారులపై ఇంటెలిజెన్స్ వర్గాలతో తగిన సమాచారం తెప్పించుకొని, ఒక్కొక్క ఐఎఎస్ అధికారి గురించి అధ్యయనం చేసిన తర్వాతనే బదిలీలు చేపట్టారని వారు వివరించారు.

అందులో భాగంగానే గత ప్రభుత్వంలో సిఎంఓ కార్యదర్శిగా మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ను బదిలీ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీనియర్ అధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకొని, సమీక్షించుకొన్న తర్వాతనే బదిలీ చేశారని ఆ అధికారులు వివరించారు. స్మితా సబర్వాల్ నీటిపారుదల ప్రాజెక్టుల పరిశీలనకు హెలికాప్టర్‌లో వెళ్ళేవారని, అలా హెలికాప్టర్‌లో ప్రాజెక్టులు పరిశీలించిన మొదటి ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాత్రమేనని తోటి ఐఎఎస్ అధికారులే అనేక విమర్శలు చేయడం, రాజకీయంగా ఆ విమర్శలు దుమారం రేపిన విషయాల్లో నిజమెంత ఉందనే అంశాలతో పాటుగా కాంట్రాక్టర్లతో ఉన్న సంబంధాల పైన కూడా తగిన సమాచారం తెప్పించుకొన్న తర్వాతనే స్మితా సబర్వాల్‌ను తెలంగాణ ఫైనాన్స్ కమీషన్‌కు సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారని వివరించారు. పైగా రాష్ట్ర కేడర్‌లోని ఐఎఎస్ అధికారుల గురించి, వారి వ్యవహారశైలి గురించి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే చీఫ్ సెక్రటరీ సలహాలు, సూచనలను పాటిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని వివరించారు.

అంతేగాక ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని బదిలీ చేస్తే ఆ పదవికి ఎవ్వరు తగిన అధికారిగా పోస్టింగ్ ఇస్తే బాగుంటుందనే అంశాలను కూడా కూలంకషంగా సమీక్షించుకొన్న తర్వాతనే బదిలీల ప్రక్రియను చేపడుతున్నారని వివరించారు. ఈ నేపధ్యంలోనే త్వరలోనే మరికొందరు సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఆలిండియా సర్వీస్ (ఎఐఎస్) అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని వివరించారు. ప్రొఫెషనల్‌గా బదిలీలు, పోస్టింగ్‌ల కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో 26 మంది ఐఎఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న 26 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొనగా బుధవారంతో దానికి తెరపడింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను నియమించారు. ఇప్పటి వరకు స్మిత సబర్వాల్ నిర్వహించిన నీటిపారుదలశాఖ కార్యదర్శి పదవిలో రాహుల్ బొజ్జా, పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండిగా ఆర్.వి.కర్ణన్, సిఎంఒ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక, నల్గొండ కలెక్టర్‌గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బిసి సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జిఎడి కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు, పంచాయతీరాజ్, ఆర్‌డి కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతిలు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News