మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్ లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. మునుగోడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రాజగోపాల్‌రెడ్డి తీరుపై సెటైర్లు సంధించిన రేవంత్‌రెడ్డి.. ఇకపై రాజగోపాల్ రెడ్డిని ఆర్‌జి పాల్ అని పిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్పటిదాకా మనకు కెఎ పాల్ మాత్రమే ఉన్నారని, ఇకపై కెఎ పాల్‌కు మన ఆర్‌జి పాల్ కూడా తోడయ్యారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాజగోపాల్‌రెడ్డి చర్యలు కామెడీని తలపిస్తున్నాయని ఆయన అన్నారు. మునుగోడు బైపోల్‌ను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నిక మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు కీలకం కానుంది.
Revanth Reddy says to Call Rajagopal Reddy as RG Paul