Wednesday, January 22, 2025

రేవంత్ కు షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పోలీసులపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వద్ద భద్రతా విధులు నిర్వహించే సిబ్బంది రెండు రోజులుగా విధులకు దూరంగా ఉన్నారు. పోలీసులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విధులకు హాజరుకాబోమని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో రెండు రోజులుగా భద్రతా సిబ్బంది లేకుండానే రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం 2+2 సెక్యూరిటీ ఉంది. అయితే బుధవారం రాత్రి నుండి భద్రతా సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. అయితే తనక భద్రతను తొలగించినట్టుగా సమాచారం అధికారికంగా రాలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే భద్రతా సిబ్బంది విధులకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయమై భద్రతా సిబ్బంది నుండి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రజా ప్రతినిధి వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా నియమితులైన పోలీస్ శాఖకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది

ఎందుకు విధులకు దూరంగా ఉన్నారనే విషయమై ఆ శాఖ నుండి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14న జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసుల పేర్లను రెండు డైరీలలో నోట్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పోలీసులను బట్టలిప్పి కొడతామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం నేత గోవర్ధన్ పట్వారి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంఎల్‌ఎలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయమై సిద్దిపేట పోలీస్‌స్టేషన్ లో కూడ పోలీసు సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News