Sunday, December 22, 2024

నన్ను జైల్లో పెట్టించింది ఎర్రబెల్లే: రేవంత్

- Advertisement -
- Advertisement -

నిన్నమొన్నటి డీలర్ దయాకర్ రావు నేడు డాలర్ దయాకర్ రావు ఎలా అయ్యాడని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలకుర్తిలో గురువారం కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేశారు. తనను జైలుకు పంపింది ఎర్రబెల్లేననీ, శత్రువులతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఎర్రబెల్లికి బొంద పెట్టాలన్నారు. ఎర్రబెల్లి ఇక్కడ దోచుకున్న ప్రజల సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని ఆరోపించారు. పాలకుర్తి అంటేనే పౌరుషాలకు పురిటి గడ్డ అని, కాంగ్రెస్ తోనే పాలకుర్తి అభివృద్ధి సాధ్యమని రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News