Monday, December 23, 2024

రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఇచ్చి, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు.

తెలంగాణలో ఇచ్చిన మాదిరిగానే 24 గంటలు ఉచిత కరెంట్ రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశ వ్యా ప్తంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇచ్చినట్లయితే దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రజల ఆదరణ కోల్పోతుందని రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందం చేసుకుని మూడు గంటల కరెంట్ చాలని వ్యాఖ్యలు చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సహకరించకుండా రైతులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశ్యంతో ప్రతి గింజ కేసీఆర్ కొనుగోలు చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్, కట్టంగూరు జెడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, ఏఎంసీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News