Thursday, January 23, 2025

రేవంత్‌రెడ్డి ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ అవసరం లేదని మూడు గంటలు ఇస్తే చాలని పేర్కొ ంటూ తన అసలు వైఖరిని బయటపెట్టి అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులపై విషం కక్కాడని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా విమర్శించారు. నాడు గురువు చ ంద్రబాబు, నేడు శిష్యుడు రేవంత్‌రెడ్డి తమ రైతు వ్యతిరేక బుద్దిని బయటపెట్టుకున్నారని మంత్రి దు య్యబట్టారు. తక్షణమే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతంగానికి క్షమాపణ చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరశైలికి నిసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ధర్నాకు హాజరై రైతులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలపై మంత్రి తీవ్రవిమర్శలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుం చి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడు ప్రయోజనం చేకూరలేదని వారి పాలనలో కరెంటు లేక రైతు ఆగమయిండిన అన్నారు. నిన్న ధరణి, నేడు కరెంటు భవిష్యత్తులో రైతుబంధు, రై తు బీమా సహ సంక్షేమ పథకాలు ఏవి వద్దంటడని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటే ఓర్వలేక రేవంత్‌రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నాడని అన్నారు. ఏపి, కర్ణాటకలో మో టర్లకు మీటర్లు పెట్టినా సీఎం కేసిఆర్ మాత్రం ఒప్పుకోలేదని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతులకు ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ గోపాల్ యాదవ్, డిసిసిబి ఇంచార్జీ చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతన్నయాదవ్, గిరిధర్‌రెడ్డి, గణేష్, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News