- Advertisement -
హైదరాబాద్: పింఛన్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసైనా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు రూ. 4 వేలకు పింఛన్లు పెంచారని… ఆ మేరకు మొదటి సంతకం పెట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ని చూసైనా నేర్చుకోవాలని, రూ. 4 వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -