- Advertisement -
హైదరాబాద్ : 2003లో వ్యవసాయం దండగా అన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రజలు ఏమి చేశారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే కాబోతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ అన్నారు. రియల్ ఎస్టేట్ చేసుకుని డబ్బులు సంపాదించిన పిసిసి అధ్యక్షుడికి అసలు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని.. రేవంత్ రెడ్డిపై అరుణ విరుచుకుపడ్డారు.
ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బిఆర్‌ఎస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతుంటే, వారి మిత్రుడు రేవంత్ వ్యవసాయానికి 24 గంటలు దండగా అనడం వెనుక కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మద్య లోపాయికారీ ఒప్పందం అయిందని డికె అరుణ ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ , బిఆర్‌ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని డికె. అరుణ ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -