Wednesday, January 8, 2025

ఐటి దాడుల నుంచి బయటపడేందుకే కెటిఆర్ ఢిల్లీ టూర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటి దాడుల నుంచి బిఆర్‌ఎస్ నేతలను కాపాడడం కోసమే మంత్రి కెటిఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”ఇటీవల కెటిఆర్ సొంత కంపెనీపై ఐటి దాడులు జరిగాయి. ఈ క్రమంలో కెటిఆర్ రహస్య ఆస్తుల వివరాలు బయటపడ్డాయి.

ఐటి దాడుల నుంచి బయటపడేందుకే కెటిఆర్, బిజెపి పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అంతేకానీ, రాష్ట్ర సమస్యల కోసం కాదు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలది ఫెవికల్ బంధం. ఢిల్లీకి వెళ్లిన బిజెపి నేతలు ఆలోచించుకోవాలి. ఢిల్లీ పెద్దలతో ఏమీ కాదు.. కెసిఆర్, బిజెపి ఒక్కటే. ఢిల్లీ వదిలి మాతో కలిసి రండి. కాంగ్రెస్‌తోనే కెసిఆర్ నుంచి తెలంగాణకు విముక్తి. రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని లిక్కర్ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు నోటీలిచ్చారు. మరి, రూ.లక్ష కోట్ల అక్రమాలకు పాల్పడిన సిఎం కెసిఆర్‌కు ఒక్క నోటిసైనా ఇచ్చారా?” అని ప్రశ్నించారు.

Also Read: ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News