Tuesday, December 3, 2024

నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా?.. ఉచిత విద్యుత్ ఇస్తే బిఆర్ఎస్ నేతలు నిరూపించాలి. 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే కొడంగల్‌, కామారెడ్డిలలో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటా. 3 గంటల వరకు నామినేషన్‌ విత్‌డ్రాకు అవకాశం ఉంది.. లాగ్‌బుక్‌లు తీసుకొని కేసీఆర్‌ కామారెడ్డికి రావాలి. దీనిపై మధ్యాహ్నం లోగా కేసీఆర్ స్పందించాలి” అని సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News