Thursday, January 23, 2025

జివో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం: రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లా డారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తరపుని నిజనిరార్ధణ కమిటీ వేస్తామని ప్రకటించారు.

ఈ కమిటీ జీవో 111 పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని, పర్యావరణ వేత్తలతో చర్చించి ఒక సమగ్రమైన నివేదికను ఇస్తుంది. దాని ఆధారంగా జీవో 111 రద్దు భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామన్నారు. పిజెఆర్ పోరాటం వల్లే కృష్ణా జలాలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు. కాంగ్రెస్ హయాంలో గోదావరి జలాలు వచ్చాయని తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News