Sunday, January 19, 2025

కాంగ్రెస్ నేతల ఇళ్లఫై దాడులకే ఐటీ పరిమితమా?: రేవంత్

- Advertisement -
- Advertisement -

ఐటీ దాడులు కాంగ్రెస్ నేతల ఇళ్ళకే పరిమితమవుతున్నాయని, బిజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్ళపై దాడులు ఎందుకు జరగట్లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ పొంగులేటి, నిన్న తుమ్మల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేసిందని, గతంలో కూడా పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని తెలిసి మోదీ, కేడీ కంగారుపడుతున్నారని, ఆ సునామీని ఆపేందుకే ఇలా దాడులు చేయిస్తున్నారని రేవంత్ ట్వీట్ చేశారు. ఈ నెల 30న వచ్చే కాంగ్రెస్ సునామీలో కారు, కమలం గల్లంతవుతాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News