Monday, November 25, 2024

కాంగ్రెస్ సీట్లను రేవంత్‌రెడ్డి అమ్ముకున్నారు?

- Advertisement -
- Advertisement -

45 కాంగ్రెస్ సీట్లను రూ. 600 కోట్లకు విక్రయం
రేవంత్‌పై ఆరోపణలు చేసిన బహిష్కృత టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని బహిష్కృత టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం ‘రేవంత్ రెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో’ అనే వాల్ పోస్టర్‌ను ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 100 సీట్లలో దాదాపు 45సీట్లకు పైగా ప్యారాచూట్ లకు టికెట్లు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.

స్పష్టమైన ఆధారాలతో తాము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వివిధ పద్ధతుల్లో నిరసన తెలియజేశామన్నారు. దీనికి తమను మమ్మల్ని పార్టీ నుంచి ఎలాంటి సంజాయిషీ లేకుండా సస్పెండ్ చేశారని, రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకొని నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ‘రేవంత్ రెడ్డి హఠావో, కాంగ్రెస్ బచావో’ అనే వాల్ పోస్టర్ను విడుదల చేస్తున్నామన్నారు. వ్యాపారవేత్తల నుంచి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని, కాంగ్రెస్ ప్రకటించిన రెండు లిస్ట్‌లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 45 కాంగ్రెస్ సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నాడని, అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని, ‘రేవంత్ రెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో’ అనే నినాదం తో ముందుకు వెళ్తామని విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News