Monday, January 13, 2025

అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను
అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.

తన వారసత్వాన్ని సగర్వంగా
సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించింది.

ఆక్షణం నుండి
జన సేవకుడిగా
ప్రజా సంక్షేమ శ్రామికుడిగా
మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో
సకల జనహితమే పరమావధిగా
జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా
సహచరుల సహకారంతో
జనహితుల ప్రోత్సాహంతో
విమర్శలను సహిస్తూ
విద్వేషాలను ఎదురిస్తూ
స్వేచ్ఛకు రెక్కలు తొడిగి
ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి
అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు
గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ
నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ
నిరంతరం జ్వలించే
ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా
విరామం ఎరుగక… విశ్రాంతి కోరక
ముందుకు సాగిపోతున్నాను

ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి
సమస్త ప్రజల ఆకాంక్షలు
సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News