Monday, January 13, 2025

బిజెపిని, బిఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దు:రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిని, బిఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఇందిరాభవన్‌లో టిపిసిసి ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఎల్‌డిఎమ్ బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో రేవంత్ ప్రసగించారు. గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని రేవంత్ సూచించారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్‌లో జూలై 18వ తేదీన శిక్షణ ఉంటుందన్నారు.

ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, ఓటరు జాబితా విషయంలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బూత్‌లు మార్చి ఓటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీటిని ఎదుర్కొవడంలో బూత్ లెవెల్ ఏజెంట్‌లే కీలకమన్నారు. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లే అన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News