Friday, January 24, 2025

ఉచిత కరెంటిచ్చిన ఘనత కాంగ్రెస్ దే: రేవంత్

- Advertisement -
- Advertisement -

ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెట్టారని ఆయన గుర్తు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలంపూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో రేవంత్ మాట్లాడారు. ఆలంపూర్ గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అన్నారు.

60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన డ్యాములు ఇప్పటికీ చెక్కుచెదరలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఆర్డీఎస్ సమస్యపై పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. బోయలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. ధరణి స్థానంలో అత్యున్నత  సాంకేతిక విలువలతో కూడిన ఒక విధానాన్ని తీసుకువస్తామన్నారు. జెండాలు, ఎజెండాలు చూడకుండా కాంగ్రెస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News