Monday, December 23, 2024

దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చాం: రేవంత్

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ 10వేల ఎకరాలను ఆక్రమించుకున్నాడని.. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ప్రజలను నమ్మించి నట్టేట ముంచాడని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్. రాష్ట్రానికి భారీ పెట్టబడులు తెచ్చింది కాంగ్రెస్. సంగారెడ్డికి అధిక పరిశ్రమలు తెచ్చి ఉపాది అవకాశాలను కల్పించింది కాంగ్రెస్. కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని కాంగ్రెస్సే కట్టించింది.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి బీసీలు, దళితులు, మైనార్టీలను మోసం చేశాయి. గతంలో కేసీఆర్ ను ఎంపిగా పాలమూరు నుంచి గెలిపిస్తే.. ఈ ప్రాంతాన్ని విస్మరించారు. పాలమూరు సత్తా ఏంటో చూపించాలి. లంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు కేసీఆర్ ను జైలుకు పంపిస్తం. మోడీతో కుమ్మక్కై ఎన్నికల ముందు రైతుబంధు వేస్తున్నారు. బీఆర్ఎస్-బీజెపీ కలిసే రైతుబంధు నగదు విడుదలకు ఈసీ నుంచి అనుమతి తెచ్చుకున్నాయి. దళితబంధు, మైనార్టీబంధు, బీసీబంధుకు ఈసీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు” అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News