మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కలపనలో ఘోరంగా విఫలమైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి బీమా ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తి అయినట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
Also Read: సచివాలయంపై కెసిఆర్‌కు ఈటల చురక!
360 మంది విద్యార్థులు ఆత్మబలిదానం జరిగి తెలంగాణ సాధించుకుంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఆత్మ బలిదానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థుల యువకులు ఉన్నారని కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మంత్రివర్గంలో మాల మాదిగలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని నిలదీశారు.